Imran stuck in Dubai: చిత్రహింసలు పెడుతున్నారు రక్షించండి.. దుబాయ్‌లో ఆదోని యువకుడి ఆవేదన
young man from Kurnool district stuck in Dubai: దేశం నుంచి బతుకుజీవుడా అంటూ పని కోసమని గల్ఫ్ దేశాలకు వెళ్తున్న భారతీయులు.. అక్కడ చిక్కుకొని అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఎవరో ఒక ఏజెంట్‌ను నమ్ముకొని అక్కడకు వెళ్లడం.. తీరా అక్కడకు వెళ్లాక మెసపోయామని గ్రహించి ఆవేదనకు గురవుతున్నారు. అలాగే తాజాగా కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడు దుబాయ్‌లో చిక్కుకుని అవస్థలు పడుతున్నాడు. ఉద్యోగం పేరుతో కర్ణాటకకు చెందిన ఓ ఏజెంట్ మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ ఉపాధి లేక, డబ్బుల కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. అలాగే తినడానికి తిండి ఇవ్వకుండా గదిలో బంధించి హింసిస్తున్నారని.. వీడియో ద్వారా సందేశం పంపాడు.
ఉపాధి కోసం రెండు నెలల క్రితం దుబాయ్ వెళ్లినట్లు ఆ యువకుడు తెలిపాడు.. అతని దగ్గర ఉన్న పాస్‌పోర్ట్ లాక్కున్నారని వాపోయాడు. ఇండియా, పాకిస్తాన్ నుంచి ప్రజలను రప్పించి.. తమ పేరు మీద దుబాయ్‌లో లక్షల్లో బ్యాంకు లోన్ తీసుకుని మోసం చేస్తున్నారని తెలిపాడు.. ఈ స్కామ్ ద్వారా భారతీయులు చాలా ఇబ్బందుల గురి చేస్తున్నారని వాపోయాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తనని తిరిగి స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నాడు.