ఆంధ్రప్రదేశ్

andhra pradesh

huge_maoist_dump_on_oab

ETV Bharat / videos

పదేళ్ల నాటి మావోయిస్టుల డంప్​ - భారీ మొత్తంలో పేలుడు సామగ్రి - ఏపీ తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 3:19 PM IST

Huge Maoist Dump On OAB :ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లోని మల్కన్​గిరి జిల్లాలోని కలిమెల పోలీసు స్టేషన్ పరిధి కూర్మాన్నూర్ గ్రామ పంచాయతీ సమీపంలోని అడవిలో జవాన్లు మావోయిస్టుల భారీ డంప్​ను స్వాధీనం చేసుకున్నారు. మల్కన్​గిరి ఎస్పీ కార్యాలయం వద్ద డంప్​లో స్వాధీనం చేసుకున్న సామగ్రిని ప్రదర్శించారు. ఈ డంపులో సుమారు 17 మందు పాత్రలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

ఈ డంప్​లో టిఫిన్​ బాంబులు, 15 కేజీల ఐఈడీ, మూడు కిలోల ఐఈడీ టిఫిన్ బాంబులు రెండు, ఎనిమిది కిలోల ఐఈడీ టిఫిన్ బాంబు ఒకటి, ఆరు కిలోల ఐఈడీ టిఫిన్ బాంబు ఒకటి, జిలెటిన్ స్టిక్స్ కట్టలు, డిటోనేటర్, ఒక గ్యాస్ సిలెండర్, 40 మీటర్ల ఎలక్ట్రికల్ వైర్​, నాటు తుపాకీ, తుపాకీ గుండ్లు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ డంప్ దాదాపు 10 సంవత్సరాల క్రితం నుంచే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. డంప్ స్వాధీనం చేసుకున్న జవాన్లను ఎస్పీ నితీష్ వాద్వానీ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details