Huge Groundnut Yield in Emmiganoor ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్కు భారీగా వేరుశనగ దిగుబడులు..
Huge Groundnut Yield in Emmiganoor : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ కొద్ది రోజులుగా వేరుశనగ దిగుబడులతో కళ కళలాడుతుంది.. రైతులు వేరుశనగ ఉత్పత్తులను మార్కెట్ కు తెస్తుండటంతో మార్కెట్ ఈసారి ఆన్ సీజన్ లో పంట ఉత్పత్తులతో రాక గణనీయంగా పెరిగింది. శుక్రవారం రికార్డు స్థాయిలో 17 వేల బస్తాలు రైతులు మార్కెట్ కు అమ్మకానికి తెచ్చారు. క్వింటా గరిష్ఠ ధర రూ.8210, మధ్యస్థ ధర రూ.7370, కనిష్ఠ ధర రూ.3409లకు వ్యాపారులు కొన్నారు. దిగుబడులతో పాటు ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులకు ఊరటనిస్తుంది. ఈ సమయంలో ఏటా రెండు మూడు వందల బస్తాలు వస్తే ఈసారి వేల బస్తాలు మార్కెట్ కు విక్రయానికి వస్తున్నాయిని రైతులు చెబుతున్నారు. జిల్లాలో ఉల్లి సాగు ఇరవై మూడున్నర వేల హెక్టార్లలో నిరుడు సాగు చేయగా ఈసారి ఆరు వేల హెక్టార్లలో సాగైంది. ఉల్లి సాగు చేసిన రైతులు ధర లేక వరుసగా పెట్టుబడులు రాక అప్పులపాలయ్యారు. దీంతో ఉల్లి రైతులు వేరుశనగ పంట సాగు మళ్లారు. ఏటా ముందుగా ఉల్లి సాగు చేసే రైతులు వేరుశనగ పంట వేయడంతో దిగుబడులు రైతుల చేతికందాయి.