గుంతల రోడ్లపై 'ఆడుదాం ఆంధ్ర' - మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంపై నిరసన - రహదారి మరమ్మతులు చేయించాలని నిరసన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 26, 2023, 1:02 PM IST
Huge Funds for Adudam Andra No Funds for Raods in manyam District : ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం రహదారుల్లో గుంతలను పూడ్చడానికి నిధులు విడుదల చేయడం లేదని టీడీపీ, సీపీఎం నాయకులు మండిపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ శివాలయం వద్ద ఆంధ్ర- ఒడిస్సా ప్రధాన రహదారిపై ఏర్పడ్డ గుంతల్లో వాలీబాల్, కబడ్డీ ఆడి వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని వాపోయారు.
Damaged Roads In Andhra Pradesh :ఆ రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని వాపోయారు. ఈ రహదారిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని నిరసన కారులు తెలిపారు. ప్రభుత్వం ఆడుదా ఆంధ్రా కార్యక్రమానికి రూ. కోట్లు ఖర్చు చెయ్యడం గొప్ప విషయమే అయినప్పటికి సంవత్సరాల తరబడి అధ్వానంగా ఉన్న రహదారులకు మరమ్మతులు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు బాగు చేయించాలని టీడీపీ, సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు.