Ganja Seized: కొత్తమార్గాల్లో గంజాయి రవాణా.. 308 కేజీలు స్వాధీనం - ఆంధ్రప్రదేశ్లో గంజాయి కేసులు
Ganja Seized in Anakapalli district: రాష్ట్రంలో గంజాయి రవాణా భారీ ఎత్తున జరుగుతుంది అనేందుకు ఇదోక నిదర్శనం. అదే విధంగా గంజాయి స్మగ్లర్లు.. రోజుకో కొత్త మార్గాల్లో రవాణా చేస్తున్నారు. గంజాయి స్మగ్లర్లు కొత్త మార్గాల్లో రవాణా చేస్తున్నా.. పోలీసులు సైతం వారి మార్గాలను కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇదే విధంగా.. కొత్త మార్గంలో గంజాయిని తరలించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసుసు పట్టుకున్నారు. గంజాయి కోసం ఏకంగా వ్యానులో ప్రత్యేకంగా ఓ అరను ఏర్పరుచుకున్నాడు.
అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట సమీపంలో ఐచర్ వ్యానులో తరలిస్తున్న గంజాయిని పొలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పాడేరు నుంచి అనకాపల్లి వెళ్తున్న వ్యానులో 308 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వ్యానులో ప్రత్యేకంగా అమర్చిన అరలో.. రెండో కంటికి తెలియకుండా దాచి గంజాయిని రవాణా చేస్తున్నారు. ఆ అరలో గంజాయి పొట్లాలను పెట్టారు. వాటిని కనిపెట్టిన పోలీసులు.. వ్యాన్ను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.