'ఆడుదాం ఆంధ్రా' క్రీడల్లో రాణించిన వారికి నగదు బహుమతులు - రోజా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 1:36 PM IST
Games Competitions In Ap :రాష్ట్ర వ్యాప్తంగా యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకే 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ క్రీడల మంత్రి రోజా అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 50రోజుల పాటు సచివాలయం, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రీడల్లో రాణించిన వారికి రూ. 12కోట్లతో నగదు బహుమతులు అందిస్తామన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రోజా కోరారు.
Sports minister Roja Started Adudam - Andhra programme :ఈ సందర్భంగా క్రీడా శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ ఆరోగ్యానికి, ఆనందానికి ఆటలు దోహదం చేస్తాయన్నారు. సచివాలయం, మండలం, నియోజకవర్గం, జిల్లాల్లో అంతటా రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ చక్కటి అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 50రోజుల పాటు ఈ క్రీడలు జరగనున్నాయని రోజా తెలిపారు. ఆన్లైన్ ద్వారా, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ క్రీడల కోసం తమ పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉండి ప్రత్సహిస్తోందని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు.