R5 Zone: రాజధాని ప్రాంతంలో జేసీబీలతో పనులు.. అన్నదాతల ఆగ్రహం
Farmers Agitation: అన్నదాతలకు, పేదలకు మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టె కుట్రలు పన్నుతోందంటూ రాజధాని రైతులు ధ్వజమెత్తారు. ఆర్- 5 జోన్ ఏర్పాటు పనులు వ్యతిరేకిస్తూ ఐనవోలు, సహా వివిధ గ్రామాల్లో రాజధాని రైతుల నిరసన చేపట్టారు. హైకోర్టు పరిధిలో ఉన్న అంశం పట్ల సీఆర్డీఏ చర్యలు కోర్టు ధిక్కరణ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేసీబీతో ఐనవోలు సమీపంలో అధికారులు జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. నిన్న కృష్ణాయపాలెం, నిడమర్రుల్లో జంగిల్ క్లియరెన్స్‌ను రైతులు వ్యతిరేకించారు. నేడు ఐనవోలు, ఇతర గ్రామాల్లో అమరావతి రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వెలగపూడిలో రాజధాని రైతు ఐకాస సమావేశానికి హాజరైన.. రాజధాని గ్రామాల రైతు ప్రతినిధులు ఆర్ - 5 జోన్ విషయంలో ఎలా ముందుకెళ్లాలని చర్చిస్తున్నారు. ఆర్ - 5 జోన్‌పై ఉత్తర్వులను హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. సుప్రీంకోర్టులోనూ రైతులు ఎస్ఎల్పీ వేశారు. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఏం చేయాలని సమాలోచనలు చేస్తున్నారు.