ఆంధ్రప్రదేశ్

andhra pradesh

farmer_plowed_his_crop_due_to_drought

ETV Bharat / videos

కరువుకాటుకు కళ్లెదుటే ఎండిపోతున్న పంటను దున్నేసిన రైతు - పెట్టుబడి, రెక్కల కష్టం మట్టిపాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2023, 12:19 PM IST

Farmer Plowed his Crop Due to Drought: సరైన సమయంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతుండటంతో చేసేదేమీ లేక రెతన్నలు.. నేలలోనే కలిపి దున్నుతున్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండిస్తే చివరికి సాగునీరు లేక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అందిచాలని రైతులు కోరుతున్నారు. పంటలు నష్టపోయిన తమకు ఆర్థిక సహాయం చేయాలని వేడుకుంటున్నారు.

వైయస్సార్ జిల్లా కమలాపురం మండలం సి గోపాలపురం గ్రామానికి చెందిన వెంకటరమణ అనే రైతు ఐదు ఎకరాల్లో మినుము సాగు చేశాడు. పంట వేసి 45 రోజులైందని వివరించాడు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎకరానికి 40 వేల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు తెలిపాడు. సాగునీరు అందక మినుము పంట ఎండిపోయిందని.. కనీసం వర్షం కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పంట ఎండిపోవడం చూడలేక.. పంటను నేలలోనే దున్నినట్లు వెంకటరమణ వాపోయాడు. దాదాపు అక్కడి రైతులందరి పరిస్థితి ఇలానే ఉందని వివరించాడు. రాగల రెండు మూడు రోజుల్లో పంటలకు నీరు అందివ్వకపోతే.. రైతులు ఆశలు వదులుకోవాల్సిందేనని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details