ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Prathidwani: ఆర్‌-5 జోన్‌పై అమరావతి రైతుల అభ్యంతరాలు...

By

Published : Apr 24, 2023, 10:13 PM IST

ఆర్‌-5 జోన్‌ నిర్ణయంపై అమరావతి రైతుల ఆందోళన చేస్తున్న సమయంలో.. భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన భూముల నుంచే ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేసినట్లు  రాష్ట్రప్రభుత్వం చెబుతోంది.  రాష్ట్ర ప్రభుత్వ తీరుని నిరసిస్తూ రాజధాని రైతులు, ప్రజలు  పోరాటం ఉద్ధృతం చేస్తున్నారు. ఆర్‌-5 జోన్‌ పరిధి ప్రాంతాల్లో ప్రజాచైతన్య పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేదలకు ఇళ్ల స్థలాల ముసుగులో మాస్టర్‌ ప్లాన్‌ విధ్వంసానికి పాల్పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. రాజధానిపైకుట్ర జరుగుతోందని   రైతులు  మండిపడుతున్నారు.  ఆర్‌-5 జోన్‌ రద్దు చేసేవరకు పోరాడతామంటూ  రైతులు ఇప్పటికై స్పంష్టం చేశారు. అసలు  ఆర్‌-5 జోన్‌పై అమరావతి రైతులకున్న అభ్యంతరాలేంటి? ఆర్‌-5 జోన్​కు వ్యతిరేకంగా అన్నదాతలు గ్రామసభల్లో ముక్తకంఠంతో వ్యతిరేకించినా... రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.  సీఆర్డీఏ చట్టం ప్రకారం రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం చట్టప్రకారంగా చెల్లుబాటు అవుతుందా?   ఆర్‌-5 జోన్ విషయం పక్కన పెడితే హైకోర్టు తీర్పు మేరకు అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టిందా... అనే అంశాలపై  నేటి ప్రతిధ్వని కార్యక్రమం.

ABOUT THE AUTHOR

...view details