ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Crop_Damage_With_Michaung_Cyclone

ETV Bharat / videos

తీరని నష్టాన్ని మిగిల్చిన మిగ్‌జాం తుపాను - ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న లంక రైతులు - కోనసీమలో మిచాంగ్ తుపానుతో పంట నష్టం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 1:36 PM IST

Crop Damage With Michaung Cyclone :మిగ్​జాం తుపాను సృష్టించిన విధ్వంసానికి అన్నదాతలకు కన్నీరే మిగిలాయి. ఆ కన్నీరు తుడవాల్సిన ప్రభుత్వం, అధికారుల వారి వైపు కన్నెతి కూడా చూడటం లేదు. ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోక పోవడం వల్లనే రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోయామని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగ్​జాం తుపాను కోలుకోలేని దెబ్బతీసిందని కర్షకులు కంటతడి పెటుకుంటున్నారు.

Lanka Villages  Farmers Problems with Heavy Rains :మిగ్​జాం తుపాను కారణంగా కోనసీమలోని లంక రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. మెుక్కజొన్న, మిర్చి, అరటి, బెండ పంటలు నీట మునిగిపోవడంతో రైతుల కన్నీరు పెట్టున్నారు. వాణజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు తుఫానుకు దెబ్బతినడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పంట నష్టాన్ని పరిశీలించేందుకు అధికారులు తమ వైపు కన్నెత్తి చూడలేదని రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా  ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని  లంక రైతులు వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details