CLAP Vehicle Drivers Protests అరకొర జీతాలతో బతకలేకపోతున్నాం.. హామీలు నెరవేర్చండి మహాప్రభో!: చెత్త సెకరించే వాహన డ్రైవర్లు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 7:44 PM IST
CLAP Vehicle Drivers Protest in Visakhapatnam: విశాఖలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ పథకంలో (క్లాప్) భాగంగా విధులు నిర్వహిస్తున్న వాహన డ్రైవర్లు నిరసనకి దిగారు. దీంతో సుమారు 800 వాహనాలు చెత్త సేకరణ కేంద్రాల వద్దే నిలిచి పోయాయి. విధుల్లో చేరే ముందు 18 వేల 500 వేతనం ఇస్తామని తీరా చేరాక.. కేవలం పది వేలతో సరి పెడుతున్నారని వాపోయారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో.. గత్యంతరం లేక సమ్మెకు దిగినట్లు క్లాప్ (Clean Andhra Pradesh) డ్రైవర్లు తెలిపారు. గతంలో సైతం పలుమార్లు సమ్మెకు దిగినప్పుడు.. అధికారులు మాట ఇచ్చినా ఇప్పటివరకూ తమ సమస్యలను పరిష్కరించలేదని అన్నారు. నగర పరిశుభ్రతలో కీలక పాత్ర పోషించే క్లాప్ వాహనాలు నిలిచిపోవడంతో.. ప్రజా ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. విశాఖలో క్లాప్ వాహన డ్రైవర్లు సమ్మెకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు.
TAGGED:
CLAP Vehicle Drivers Protest