BABU CHALLENGE: సీఎం జగన్‌కు.. చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ - సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన చంద్రబాబు
Chandrababu Selfie Challenge : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన సెల్ఫీ ఛాలెంజ్లో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లికి వెళ్లారు. అక్కడ తురక అనిల్ కుటుంబానికి అందజేయాల్సిన పరిహారం చెక్కు ఏమైందని..వైసీపీ మంత్రి అంబటి రాంబాబుని చంద్రబాబు ప్రశ్నించారు. సత్తెనపల్లిలో తనను కలిసిన బాధిత కుటుంబంతో సెల్ఫీ దిగిన చంద్రబాబు.. మంత్రి అవినీతిని ప్రశ్నిస్తూ.. సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. పరిహారంలో వాటా ఇవ్వలేదనే మృతుని కుటుంబానికి చెక్ ఇవ్వకుండా మంత్రి అంబటి అడ్డుకున్నారని విమర్శించారు. బాధితులు తురక గంగమ్మ కుటుంబానికి పార్టీ నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయంతో పాటు.. ఆమె కుమార్తెను చదివిస్తామని హామీ ఇచ్చారు అంబటి ఆ చెక్ ఇప్పుడు ఎక్కడ ఉందో చెప్పాలని అన్నారు? నిన్న సత్తెనపల్లిలో తన సభకు రాకుండా బాధితులు తురక గంగమ్మ, పర్లయ్య కుటుంబాన్ని పోలీసులతో ఎందుకు నిర్బంధించారో సమాధానం చెప్పాలన్నారు.
ఇవీ చదవండి :