ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CBI_Director_Visited_Simhachalam_Temple

ETV Bharat / videos

CBI Director Visited Simhachalam Temple: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ - Vizag News

By

Published : Aug 10, 2023, 8:33 PM IST

CBI Director Praveen Sood Visited Simhachalam Temple: దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరొందిన సీబీఐ డైరెక్టర్​గా ప్రవీణ్ సూద్ ఎంపికైన విషయం తెలిసిందే.. తాజాగా ఆయన విశాఖ జిల్లాలోని శ్రీశ్రీశ్రీ వరహా లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాద్రి అప్పన్న దర్శించుకుని.. స్వామికి వారికి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాధ రావు అర్చక బృందముతో, వేద పండితులతో నాదస్వరాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా కప్ప స్తంభం ఆలింగణం చేసిన అనంతరం బేడా మండపం ప్రదక్షణ చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. చివరగా అర్చకులు స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజ చేయించారు. తదుపరి వేద పండితుల వేద ఆశీర్వచనము ఇచ్చి.. స్వామి వారి శేష వస్త్రముతో సత్కరించి.. తీర్థ ప్రసాదాలను అందజేశారు. విరు ఆలయానికి వచ్చిన దగ్గర నుంచి వెళ్లేంత వకరు వేద పండితులు వీరితో పాటే ఉంది నిర్వహణ పనులను చూసుకున్నారు. వీరితో పాటు విశాఖపట్నం సీబీఐ ఎస్పీ, ఏసీపి నరసింహమూర్తి గోపాలపట్నం పోలీస్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details