ఆంధ్రప్రదేశ్

andhra pradesh

BJP_Purandeswari_on_TTD_Chairman_Post

ETV Bharat / videos

BJP Purandeswari on TTD Chairman Post: 'హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవారినే టీటీడీ ఛైర్మన్​గా నియమించాలి'

By

Published : Aug 8, 2023, 6:16 PM IST

BJP Purandeswari on TTD Chairman Post: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా హిందూ ధర్మంపై నమ్మకం ఉన్న వారిని నియమించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్ చేశారు. హిందూ ధర్మం అనుసరించే వారికే ఈ పదవి కట్టబెట్టాలని ఆమె కోరారు. తితిదే ఛైర్మన్‌ అన్నది రాజకీయ పునరావాస పదవి కాకూడదని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ట్వీట్ చేశారు. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేసిందని.. కోర్టు ఆదేశాల తర్వాత 52మంది నియామకం నిలిపివేసిన అంశాన్ని పురందేశ్వరి గుర్తు చేశారు. టీటీడీ పాలక మండలిలో పదవిని రాజకీయ పునరావాస నియామకాలుగానే రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోందని ఆమె విమర్శించారు. ఇటీవల తితిదే నూతన ఛైర్మన్​గా వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్​రెడ్డిని వైసీపీ సర్కార్ నియమించింది. ఈ నేపథ్యంలో పురందేశ్వరి ట్వీట్ చేయటం ప్రాధ్యాన్యం సంతరించకుంది.

"టీటీడీ బోర్డు ఛైర్మన్ అన్నది రాజకీయ పునరావాస పదవి కారాదు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లే ఈ పదవికి న్యాయం చేయగలరు." - పురందేశ్వరి ట్వీట్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details