ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Anam Ramanarayana Reddy on Jagan Govt 144 సెక్షన్, 30 పీసీ యాక్ట్ ఇన్నిరోజుల పాటు ఎక్కడైనా అమలులో ఉందా..? కేంద్రం జోక్యం చేసుకోవాల్సిందే: ఆనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 10:32 PM IST

Anam Ramanarayana Reddy Sensational Comments

Anam Ramanarayana Reddy Sensational Comments: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని.. గవర్నర్ నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక భాగమని కేంద్రం గుర్తించాలని.. రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ప్రజలు స్వేచ్ఛ స్వాంత్రంత్ర్యాలను కోల్పోయారని అన్నారు. ప్రశ్నిస్తే అణిచివేత ధోరణి నుంచి ప్రజాస్వామ్య పాలనకు కేంద్రం, గవర్నర్ కలిసి శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు. 

28 రోజుల నుంచి 144 సెక్షన్, 30 పీసీ యాక్ట్ ఏ రాష్ట్రంలోనైనా అమలులో ఉందా అని ప్రశ్నించిన ఆనం.. కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం లేదని.. విలువలను కాలరాస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రం గుడ్డిదైంది. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి.. ఒక్క రోజు కోర్టుకు హాజరుకాకుండా బెయిల్​పై కొనసాగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని మండిపడ్డారు. సీఎం జగన్ పాలనాధ్యక్షత లేని వ్యక్తి అని విమర్శించారు. ఒక జాతీయ నాయకుడిపై ఎటువంటి సాక్ష్యాలు లేకుండా రిమాండ్ ఖైదీగా ఉంచారని మండిపడ్డారు. విడుదల చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుర్మార్గమైనపాలన కొనసాగుతుందని.. గడపదాటి బయటకు వస్తే పోలీసులతో తొక్కిస్తామని బెదిరించడం ఏ రాష్ట్రంలో లేదని ఆనం రామనారాయణరెడ్జి ధ్వజమెత్తారు. 

ABOUT THE AUTHOR

...view details