ఆంధ్రప్రదేశ్

andhra pradesh

kasula_danda

ETV Bharat / videos

బ్యాంకు లాకర్​లో భద్రంగా ఉందనుకున్నారు - తెరచి చూస్తే 'అమ్మవారి కాసుల దండ' మాయం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 7:20 PM IST

Ammavari Kasula Danda Mayam in Nellore District : నెల్లూరు జిల్లా సంగం మండలం వంగల్లులోని భీమేశ్వరస్వామి ఆలయం అమ్మవారి 82 గ్రాముల పురాతన బంగారు కాసుల దండ మాయమైంది. ఈ ఆలయానికి 12 రకాలు అభరణాలు ఉన్నాయి. వాటిని బ్యాంకు లాకర్లో భద్రపరిచారు. ఈవో నవీన్ కుమార్ అప్పట్లో సుధాకర్ అనే అధికారికి ఆభరణాలు స్వాధీనం చేశారు. ఆయన 2019 ఏప్రిల్‌లో రమేష్ రెడ్డి అనే అధికారికి అప్పగించారు. బ్యాంకు అధికారుల స్వాధీన పత్రాల్లో దారంతో కట్టిన కాసుల దండ అనే ఆభరణం గురించి పేర్కొన్నారు.

రమేష్ రెడ్డి 2019 సంవత్సరం నవంబరు 27వ తేదీన శ్రీలత అనే అధికారికి ఈ ఆభరణాలు అప్పగించే క్రమంలో బంగారు కాసుల దండను స్వాధీనం చేయలేదు. ఈ మేరకు వివరాలు నమోదు చేయలేదు. త్వరలో బ్రహ్మోత్సవాలు నిర్వహించాల్సి ఉండటంతో ధర్మకర్తల మండలి బ్యాంకు లాకర్ తెరవగా అందులో బంగారు కాసుల దండ కనిపించలేదు. సంబంధిత అధికారి ఈ లాకర్‌ని 2020 నవంబరు 20న రెండుసార్లు తెరచినట్లు బ్యాంకు దస్త్రాల్లో నమోదై ఉంది. ఈ ఆభరణం గురించి దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌కు ఆలయ ఛైర్మన్‌ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details