Agitation: నెల్లూరు మేయర్‌పై దాడికి నిరసనగా.. గిరిజన సంఘాల అధ్వర్యంలో ఆందోళన - ఈ రోజు ఏపీ వార్తలు
Nellore Mayor Attack : నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్రవంతిపై దాడి యత్నానికి నిరసనగా.. గిరిజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. మేయర్‌తో అనుచితంగా వ్యవహరించిన ముగ్గురు కార్పొరేటర్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని గిరిజన సంఘ నేతలు డిమాండ్ చేశారు. దాడి ఘటనపై ఇప్పటివరకు విచారణ అధికారిని నియమించకపోవడం అన్యాయమన్నారు. ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించడం లేదంటూ గిరిజన నేతలు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డగించారు. అనంతరం గిరిజన నేతల వద్దకు వచ్చిన డీఆర్వో వెంకట నారాయణమ్మకు వినతిపత్రం అందజేశారు. మేయర్‌పై దాడి ఘటనపై విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పెంచలయ్య హెచ్చరించారు. దాడి జరిగి మూడు రోజులు అవుతున్నe పోలీసులు దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదన్నారు. నగర ప్రథమ పౌరురాలికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఎంటనీ ప్రశ్నించారు.