నాలుగు ఇంజన్లు...176 వ్యాగన్లు..ఆసక్తిగా చూసిన జనాలు
సాధారణంగా ఓ గూడ్స్ రైలుకు 60 లోపు వ్యాగన్లు ఉంటాయి. ప్రయాణికుల రైలుకైతే 25లోపు వరకు కోచ్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఓ గూడ్స్ రైలు 176 వ్యాగన్లతో రాకపోకలు సాగించింది. మూడు గూడ్సు రైళ్లు కలిపి ఒకే రైలుగా నడిపారు. దసరా పండగ సందర్భంగా దానికి త్రిశూల్ అని పేరు పెట్టారు. నాలుగు ఇంజన్లతో రైలు నడిపారు. కొండపల్లి నుంచి సింహాచలం వరకు రాజమహేంద్రవరం మీదుగా ఈ రైలు ప్రయాణించింది. గతంలో రెండు గూడ్సు రైళ్లు కలిపి నడిపిన సందర్భాలు ఉన్నాయి. కానీ విజయవాడ డివిజన్లో తొలిసారి మూడు గూడ్స్ లను కలిపి ఒకే రైలుగా నడిపింది మాత్రం ఇదే తొలిసారి. ఈ రైలు మొదలైన చోట నుంచి గమ్యస్థానం చేరే వరకు ఎక్కడ ఆగకుండా చేరేలా ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో ఈ పొడవైన గూడ్స్ రైలు వెళ్తుంటే ప్రయాణికులు ఆసక్తిగా చూశారు.
Last Updated : Oct 7, 2021, 10:48 PM IST