ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: భారత్​లో అమెరికా పెట్టుబడులు

By

Published : Jul 23, 2020, 10:06 PM IST

భారత్​లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయమని ప్రధాని మోదీ అమెరికా వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. టెక్నాలజీ రంగంలో 5జీ, బిగ్​డేటా, క్వంటాన్​ కంప్యూటింగ్​, బ్లాక్​చైల్​, ఇంటర్నెట్​ ఆఫ్​ తింగ్స్​లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఇన్​పుట్స్​, యంత్రాలు, సరఫరా వ్యవస్థలు, రెడీ టూ ఈట్​ ఐటమ్స్​లో పెట్టుబడులు పెట్టొచ్చు. రక్షణ, అంతరిక్ష రంగాల్లోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక, బీమా, మౌలిక వసతులు, మెడికల్​ టెక్నాలజీ, టెలిమెడిసిన్​ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే సరైన సమయం దొరకదని మోదీ సూచించారు. ఈ నేపథ్యంలో అమెరికా భారత్​లో ఏ మేరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details