ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్ధరాత్రి మహిళపై అధికారపార్టీ కార్యకర్తల దాడి - కడప జిల్లాలో మహిళపై వైకాపా కార్యకర్తల దాడి

వైయస్‌ఆర్‌ జిల్లా చాపాడు మండలం రేపల్లెకు చెందిన జక్కల బయమ్మపై.. అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు సోమవారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. గ్రామంలో 40 ఏళ్లుగా ఉన్న కరెంటు స్తంభాన్ని తొలగించి.. దాన్ని తమ సొంత స్థలంలో ఏర్పాటు చేయడానికి వైకాపా కార్యకర్తలు ప్రయత్నించినట్లు బాధితురాలు తెలిపారు. ఈ విషయమై కొందరితో గొడవ జరగ్గా.. ఆమెపై దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ysrcp leaders attack on women
అర్ధరాత్రి మహిళపై అధికారపార్టీ కార్యకర్తల దాడి

By

Published : Jul 6, 2022, 8:25 AM IST

వైయస్‌ఆర్‌ జిల్లా చాపాడు మండలం రేపల్లెకు చెందిన జక్కల బయమ్మపై.. అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ కార్యకర్తలు సోమవారం అర్ధరాత్రి దాడిచేసి గాయపరచినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలో 40 ఏళ్లుగా ఉన్న కరెంటు స్తంభాన్ని తొలగించి.. దాన్ని తమ సొంత స్థలంలో ఏర్పాటు చేయడానికి వైకాపా కార్యకర్తలు ప్రయత్నించినట్లు చెప్పారు. దాంతో విద్యుత్తు, పోలీసు శాఖ అధికారులను సంప్రదించి తమ సమస్యను చెప్పామన్నారు.

గత అయిదారు నెలలుగా అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి పొద్దుపోయాక కొందరు వచ్చి దీని గురించి గొడవ పడి తనను, తమ కుటుంబీకులను గాయపరచినట్లు వివరించారు. ఇక తనకు న్యాయం జరగదని తీవ్ర మనస్తాపానికి గురై విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితురాలు చెప్పారు.

ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను తెదేపా జిల్లా అధికార ప్రతినిధి మునిశేఖర్‌రెడ్డి, నాయకులు రవిశంకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలవుతున్నా ఈ ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదని వారు విమర్శించారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details