దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కడప జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఉదయం కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాయిరాం ధియేటర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని సుధీర్ రెడ్డి అన్నారు. పరిపాలనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని మెచ్చుకున్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఉచిత విద్యుత్,ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి అని సుధీర్ రెడ్డి అన్నారు.
జమ్మలమడుగులో ఘనంగా వైఎస్ జయంతి - ys rajshekar reddy birth annniversary
కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
జమ్మలమడుగులో ఘనంగా వైఎస్ జయంతి