ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

ఈనెల 1న జరిగిన ఆటో ప్రమాదంలో గాయపడిన మహిళ మృతిచెందింది. ఉపాధి పనుల కోసం ఆటోలో వెళ్తుండగా వాహనం బోల్తాపడి 8 మంది గాయపడ్డారు. వీరిలో ఒక మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

woman died in kadapa with accident
ఆటో ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

By

Published : May 2, 2020, 4:35 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు మండలం సిరిగెపల్లి వద్ద ఈనెల ఒకటో తేదీన జరిగిన ఆటో ప్రమాదంలో గాయపడిన మహిళ మృతిచెందింది. దేవగుడి గ్రామానికి చెందిన మహిళలు ఉపాధి హామీ పనులకోసం ఆటోలో వెళ్లారు. ఆ సమయంలో ఆటో అదుపుతప్పి సిరిగెపల్లి వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. వీరిలో ఒక మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కడపకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఈరోజు మృతిచెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details