ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'3 నెలలుగా జీతాలు లేవు.. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి?' - volunteers give the petition to mpdo news update

మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని కడప జిల్లాలో 98 మంది వాలంటీర్లు ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

Volunteers give the petition to the MPDO
ఎంపీడీఓకు వాలంటీర్లు వినతి పత్రం అందజేత

By

Published : Jul 16, 2020, 4:43 PM IST

కడప జిల్లా కమలాపురం స్థానిక ఎంపీడీఓకు వాలంటీర్లు వినతి పత్రం అందజేశారు. నగరానికి చెందిన 98 మంది వాలంటీర్లకు మూడు నెలల నుంచి మాకు గౌరవ వేతనం ఇవ్వలేదని ఆరోపించారు. జీతాలు లేక ఇల్లు గడవడం కష్టంగా ఉందని ఆవేదన చెందారు.

కొంతమంది వాలంటీర్లకు టాబ్​లు, సిమ్​ కార్డులు లేవని, పింఛన్​ పంపిణీ కష్టంగా మారుతోందని చెప్పారు. సమస్యలు విన్న ఎంపీడీవో శివరామిరెడ్డి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details