వైకాపా అధినేత జగన్ చిన్నాన్న.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. వివేకా నివాసానికి కాసేపటి క్రితమే జగన్ చేరుకున్నారు.
11 గంటలకు వివేకా అంత్యక్రియలు
By
Published : Mar 16, 2019, 10:02 AM IST
11 గంటలకు వివేకా అంత్యక్రియలు
వైకాపా అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. కడప జిల్లా పులివెందులలో అంతిమయాత్ర అనంతరం.. రాజారెడ్డి ఘాట్లో అంత్యక్రియలు చేయనున్నారు. కుటుంబసభ్యులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు అనుచరులు భారీగా ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. కాసేపటి క్రితమే జగన్.. వివేకా ఇంటికి వెళ్లారు.