ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

viveka murder case: వివేకా హత్య కేసు.. మాజీ డ్రైవర్ దస్తగిరిని మరోసారి ప్రశ్నిస్తున్న అధికారులు - మాజీ మంతి వివేకా హత్య కేసు సీబీఐ విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(viveka murder case)లో 17వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

viveka murder case
viveka murder case

By

Published : Jun 23, 2021, 10:46 AM IST

Updated : Jun 23, 2021, 12:44 PM IST

వైఎస్‌ వివేకా హత్య కేసులో 17వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ అధికారులు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని మరోసారి విచారిస్తున్నారు. రెండు నెలల వ్యవధిలో సీబీఐ అధికారులు మాజీ డ్రైవర్​ను ప్రశ్నించడం ఇది మూడోసారి. కాగా మంగళవారం వైకాపా కార్యకర్త చిన్నపరెడ్డిని విచారించారు.

పులివెందులలో అధికార పార్టీకి చెందిన ఓ కుటుంబాన్ని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వైకాపాకు చెందిన కృష్ణయ్య, సావిత్రి అనే దంపతులతో పాటు.. వారి ఇద్దరు కుమారులు సునీల్ కుమార్, కిరణ్ కుమార్, కుమార్తె నందిని సీబీఐ విచారణకు హాజరయ్యారు.

Last Updated : Jun 23, 2021, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details