ఈ మండలంలో 13 గ్రామ పంచాయతీలు, నలభై వేల జనాభా ఉన్నారు. కలసపాడు మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీలో మాత్రం ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించే పరిస్థితి లేదు. అక్కివారిపల్లె, మహనందిపల్లె గ్రామ పంచాయతీలో మహనందిపల్లె మామిళ్లపల్లె, మహబూబ్‌నగర్, లింగారెడ్డిపల్లె గ్రామ పంచాయతీలో లింగారెడ్డిపల్లె, కరణంవారిపల్లె, హృదయపేట, శంఖవరం, గ్రామాలు 2 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ముగ్గురాయి గనిలో ఎడతెరపి లేకుండా పనులు సాగుతుండటంతో పేలుళ్ల కారణంగా పెద్ద శబ్ధాలతో పాటు భూమి కంపించినట్లు ఉండటంతో భయపడుతూ పల్లె జనం దినదినగండంగా కాలం గడుపుతున్నారు. సమీపంలోని పశువులను మేతకు అడవీ ప్రాంతాలకు వెళ్లాలన్నా పేలుళ్లతో భయపడుతున్నారు. మామిళ్లపల్లె ముగ్గురాయి గనులు వద్ద ఎలాంటి రక్షణ కంచె లేదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే కొండ ప్రాంతం మారుమూల ఉండటంతో ఇంటికి సమాచారం ఇచ్చేవారుండరు.
పెద్ద పెద్ద శబ్ధాలతో భయం
వ్యవసాయంపై ఆదారపడి జీవనం సాగిస్తున్నాను.పెద్ద శబ్దాలు వచ్చినపుడు భూమి కంపించినట్లు ఉంటుంది. ఎప్పుడు పేలుస్తారో తెలియదు. పశువులు మేతకు సమీనంలోని కొండకు వెళ్తాయి. ఇంటికి తిరిగి వచ్చే వరకు నమ్మకం లేని పరిస్థితి. పేలుళ్లు లేకుండా పల్లె జనం ప్రశాంతమైన జీవనం సాగేందుకు చర్యలు చేపట్టాలి. - గురయ్య రైతు, లింగారెడ్డిపల్లె కలసపాడు మండలం