కడప జిల్లా జమ్మలమడుగులో ఈదురుగాలులులతో కూడిన వాన పట్టణాన్ని అతలాకుతలం చేసింది. అర్థరాత్రి తర్వాత వీచిన పెనుగాలులకు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. రాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ధాన్యం నిల్వ ఉంచిన గోదాముల రేకులు ఎగిరిపోయాయి. వర్షం కారణంగా నిల్వ ఉంచిన శనగలు నానిపోయాయి. ఇళ్ల పైకప్పులు పాడైపోయాయి. అధికారులు పరిశీలించి తమకు పరిహారం ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
జమ్మలమడుగులో గాలివాన బీభత్సం - jammalamadugu
కడప జిల్లా జమ్మలమడుగులో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం అర్థరాత్రి తర్వాత పెనుగాలులు వీచాయి.
గాలివాన