కడప జిల్లా సుండుపల్లి మండలం జీకే రాచపల్లి వద్ద చెరువులో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. మృతులు మడితాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు (25) సంజీవలు (22)గా పోలీసులు గుర్తించారు. వీరు శుక్రవారం గొర్రెలను మేపేందుకు వెళ్లారు. రాత్రి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల గాలించినా ఆచూకి తెలియలేదు. శనివారం ఉదయం చెరువు నీటిలో తేలియాడిన మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రాయచోటి రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మృతదేహాలను వెలికి తీసి విచారణ చేపట్టారు. వీరి మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చేపల వేటకు వెళ్లి అన్నదమ్ములు మృతి! - రాచపల్లిలో చెరువులో పడి ఇద్దరు మృతి
కడప జిల్లా సుండపల్లి మండలం జీకే రాచపల్లిలో అప్పయ్య చెరువులో పడి అన్నదమ్ములు మృతి చెందారు. వీరిద్దరూ శుక్రవారం గొర్రెలు మేపేందుకు వెళ్లారు. గొర్రెలు ఇంటికి తిరిగివచ్చాయి కానీ అన్నదమ్ముులు రాలేదు. వారి కోసం కుటుంబసభ్యులు వెతకగా... అప్పయ్య చెరువులో మృతదేహాలు తేలాయి. చేపలు పట్టేందుకు చెరువులో దిగి మరణించారా లేదా హత్యాయత్నం కోణమేమైనా ఉందా అని పోలీసులు విచారణ చేస్తున్నారు.
చేపల వేటకు వెళ్లి అన్నదమ్ముల మృతి