కడప జిల్లా సిద్ధవటంలో విషాదం చోటు చేసుకుంది. పెన్నానదిలో సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృత్యవాత పడ్డారు. గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్, లాజిత్లు ఇవాళ మధ్యాహ్నం పెన్నానదిలో ఈతకు వెళ్లారు. ఈత కొడుతూ ప్రవాహ ఉద్ధృతికి నీటిలో కొట్టుకుపోయారు. పోలీసులు, విపత్తు నివారణ సిబ్బంది గాలింపు చేపట్టి చిన్నారుల మృతదేహాలను బయటికి తీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పెన్నానదిలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి - ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
పెన్నానదిలో సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కడప జిల్లా సిద్ధవటంలో జరిగింది. శ్రావణ్ కుమార్, లాజిత్లు మరణించటంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
పెన్నానదిలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి