ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవునికడపలో పసుపు గ్రేడింగ్ యూనిట్లో అగ్ని ప్రమాదం

కడప జిల్లా దేవునికడప మార్కెట్ యార్డ్​ సమీపంలోని ప్రైవేట్ పసుపు గ్రేడింగ్ యూనిట్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.

By

Published : Apr 15, 2019, 11:21 AM IST

దేవుని కడపలో పసుపు గ్రేడింగ్ యూనిట్లో అగ్ని ప్రమాదం

కడప జిల్లా దేవునికడపలో జరిగిన అగ్నిప్రమాదానికి పసుపు దగ్దమైంది. మార్కెట్ యార్డ్​ సమీపంలోని ప్రైవేట్ పసుపు గ్రేడింగ్ యూనిట్​లో ఈ ప్రమాదం జరిగింది. గ్రేడింగ్ చేసిన పసుపు బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 350 క్వింటాళ్ల పసుపు బస్తాలు కాలిపోయాయి.2 అగ్నిమాపక వాహనాలతో మంటలు అదుపు చేశారు.దుర్ఘటనలో సుమారు 20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. విద్యుదాఘాతం వలనే ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ సిబ్బంది పేర్కొన్నారు.

దేవుని కడపలో పసుపు గ్రేడింగ్ యూనిట్లో అగ్ని ప్రమాదం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details