టమాటా పంట రైతులకు కష్టాలు, కన్నీళ్లనే మిగిల్చింది. అప్పులు చేసి పంట సాగు చేశారు. దిగుబడి ఉన్నా.. ధరలేదు. కాయలు కోసి విక్రయించాలన్నా కూలీలకు ఇచ్చే డబ్బులు కూడా గిట్టుబాటు కావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేది లేక పంటలను అలాగే పొలంలో వదిలేస్తున్నారు. కడప జిల్లా రాయచోటి మండలం దిగువ అబ్బవరం కమ్మపల్లెకు చెందిన జి.భాస్కర్‌నాయుడు రూ.6 లక్షల పెట్టుబడితో నాలుగు ఎకరాల్లో టమాటా సాగు చేశారు. లాక్‌డౌన్ రావడంతో.. గిట్టుబాటు లేక వదిలేసినట్లు రైతు చెప్పారు.
దిగుబడి ఉన్నా.. అప్పుల బాధే మిగిలింది. - tomoto farmers difficulties
టమాటా పంట దిగుబడి మెండుగా ఇచ్చినా... రైతులు కన్నీళ్లే మిగిల్చింది. ధర లేక, పెట్టిన పెట్టుబడి తిరిగి రాక ఆవేదన చెందుతున్నారు. చేసేది ఏమీ లేక పంటను పొలంలోనే వదిలేస్తున్నారు.
టమాటా రైతుల కష్టాలు