ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పొగాకు జీవితాన్ని నాశనం చేస్తుంది'

పొగాకు వినియోగం మంచిది కాదనీ.. దానివల్ల జీవితాలు నాశనమవుతాయని కడప జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఉమాసుందరి అన్నారు. పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేపట్టారు.

పొగాకుపై అవగాహన ర్యాలీ

By

Published : May 31, 2019, 1:21 PM IST

పొగాకుపై అవగాహన ర్యాలీ

పొగాకు మన జీవితాన్ని నాశనం చేస్తుందనీ.. అందుకే దానికి దూరంగా ఉండాలని కడప జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఉమా సుందరి అన్నారు. ఇవాళ ప్రపంచ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా.. కడపలో డీఎంహెచ్​ఓ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పొగాకు వల్ల దేశంలో ఏటా లక్ష మంది మరణిస్తున్నారన్నారు. పొగాకు వల్ల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయనీ.. దాని వినియోగం మానుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో ఎన్​సీసీ విద్యార్థులు, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details