కడప జిల్లాలో శానిటైజర్ తాగి ముగ్గురు మృతి - sanitizer deaths in kadapa district
07:55 August 03
కడప జిల్లాలో శానిటైజర్ తాగి ముగ్గురు మృతి
రాష్ట్రంలో శానిటైజర్ మరణాలు ఆగడం లేదు. మద్యానికి బానిసై మందు దొరక్క వ్యసనపరులు శానిటైజర్ తాగుతున్నారు. కడప జిల్లా పెండ్లిమర్రికి చెందిన ముగ్గురు శానిటైజర్ తాగి మృత్యువాత పడ్డారు. నిన్న శానిటైజర్ తాగి ఇద్దరు మరణించారు. ఇవాళ మరో వ్యక్తి మృతి చెందాడు. వారం రోజుల నుంచి ఆరుగురు శానిటైజర్ తాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఇదీ చదవండి: హఠాత్తుగా ఆపద.. కొవిడ్ రోగుల హఠాన్మరణం