కడప జిల్లా జమ్మలమడుగు - ఆర్టీపీపీ బైపాస్ రోడ్డులోని కావేరీ ఈడెన్ స్కూల్ ఎదురుగా ఉన్న... ఎద్దుల క్రిష్ణారెడ్డి ఈ నెల 1న షిరిడి వెళ్లారు. వెళ్తూ... పోలీసులు ప్రవేశ పెట్టిన ఎల్‌హెచ్‌ఎంఎస్ ద్వారా తన ఇంటిని జాగ్రత్త చేసుకున్నారు. ఇది తెలియక ఎల్‌హెచ్‌ఎంఎస్ ఉచ్చులో చిక్కుకుని.. ఓ దొంగ కటకటాల పాలయ్యాడు. నిందితుడు బాలచంద్ర.. దొంగతనం చేస్తుండగా పోలీసులకు రెడ్ హాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతనిపై ఇప్పటికే 15 నేరాల్లో కేసులు నమోదయ్యాయి. ఎర్రచందనం అక్రమ రవాణా, హత్యా నేరాల్లోనూ నిందితుడుగా ఉన్నట్లు డీఎస్పీ సుధాకర్ వివరించారు.
దొంగను పట్టించిన లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టం - LHMS
కడప జిల్లా ప్రొద్దుటూరులో లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టం మరో దొంగను పట్టించింది. తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడుతున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దొంగతనం జరుగుతున్న స్థలానికి ఎల్‌హెచ్‌ఎంఎస్ సాయంతో చేరుకొని దాసరి బాలచంద్ర అనే దొంగను పట్టుకున్నారు.
డీఎస్పీ సుధాకర్