ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామ సచివాలయాల ఉద్యోగ అభ్యర్థులకు హెల్ప్ డెస్క్​లు

సెప్టెంబరు 1 నుంచి 8వ తేదీ వరకు కడప జిల్లాలో నిర్వహించే గ్రామ సచివాలయాల పరీక్షల ఏర్పాట్లకు సన్నద్ధం కావాలంటూ జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.

The district collector has been advised the officers to prepare for the job arrangements of the village secretariats in Kadapa from September 1 to 8.

By

Published : Aug 27, 2019, 6:40 AM IST

కడప జిల్లాలో సెప్టెంబరు 1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సచివాలయాల ఉద్యోగాల పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 266 కేంద్రాల్లో లక్షన్నర మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని ఆయన తెలిపారు. పరీక్షల సందర్భంగా చిన్న తప్పు జరిగినా పెద్ద సమస్యగా మారుతుందనే విషయం అధికారులంతా గుర్తుంచుకోవాలని ..పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ అంతా ఈనెల 30వ తేదీన అధికారులకు అందజేస్తామన్నారు. వీటితోపాటు గ్రామ సచివాలయాల ఉద్యోగాల అభ్యర్థులకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. గ్రామ సచివాలయాల పరీక్షలు రాసే అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నంబరు-1077, ఫోన్ నంబర్-08562-246344 కు ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ నంబర్లు ఈనెల 27వ తేదీ నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details