గడిచిన ఆరు సంవత్సరాలుగా రాజంపేటలో ఒక్కరికి కూడా ఇళ్లస్థలాలు ఇవ్వలేదని కడప సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎన్ని అర్జీలు ఇచ్చినా ఆర్డీవోలు పట్టించుకోలేదని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార్ల తీరుకు నిరసనగాస్థానిక ఏఐటీయూసీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
పేదల ఇళ్ల స్థలాల కోసం ఉద్యమించిన సీపీఐ
కడప జిల్లా రాజంపేటలో ఇళ్ల స్థలాల కోసం పేద ప్రజలతో కలిసి సీపీఐ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు, రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీపీఐ