కరోనా నివారణలో అధికారులు విఫలమయ్యారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. అధికారుల వైఫల్యాలను నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా భయంతో కడప నగర ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. అధికారులు తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.
'కరోనా నివారణలో అధికారులు విఫలమయ్యారు' - కడపలో కరోనా కేసులపై తెదేపా వ్యాఖ్య
కరోనా నివారణలో అధికారులు వైఫల్యాలను నిరసిస్తూ తెదేపా నిరసన చేపట్టింది. అధికారులు తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు
tdp on corona cases in kadapa
కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదని, శుద్ధ నీటిని అందించడం లేదని గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. నిధులు లేవంటూ అధికారులు చేతులెత్తేశారని విమర్శించారు. ప్రభుత్వం తక్షణం కరోనా నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదీ చదవండి: కరోనా విజృంభిస్తున్న వేళ మన ఆహార ప్రణాళిక ఎలా ఉండాలంటే..