ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో ఎన్టీఆర్ వర్ధంతి.. సేవలు స్మరించుకున్న నేతలు - కడప లో నందమూరి తారక రామారావు 24వ వర్ధంతి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 24వ వర్ధంతిని కడపలో పార్టీ నేతలు నిర్వహించారు. సేవలు స్మరించుకున్నారు.

Tdp leaders paid homage to the statue of NTR.
కడపలో ఎన్టీఆర్ వర్ధంతి

By

Published : Jan 18, 2020, 4:32 PM IST

కడపలో ఎన్టీఆర్ వర్ధంతి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 24వ వర్ధంతిని కడప నగరంలో పార్టీ నాయకులు నిర్వహించారు. ఎన్టీఆర్ కూడలిలో ఉన్న విగ్రహానికి కడప నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ అమీర్ బాబు పూలమాల వేసి నివాళి అర్పించారు. కోటిరెడ్డి కూడలి నుంచి కొండాయపల్లె వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. రాజధానికి మద్దతుగా తెదేపా శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారని నేతలు చెప్పారు.

కడపలో ఎన్టీఆర్ వర్ధంతి

రాజంపేట పట్టణంలో ఎన్టీఆర్ వర్ధంతిని తెలుగుదేశం నేతలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు.. ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. గజమాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే అధికారం చేపట్టి ప్రజలకు మంచి పరిపాలన అందించారని ఎన్టీఆర్ సేవలు గుర్తు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details