SC ON YS VIVEKA MURDER CASE : మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తు బదిలీ పిటిషన్‌పై.. సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై తీర్పు.. వచ్చే సోమవారానికి తీర్పు వాయిదా వేసింది. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ తీర్పును.. వచ్చే సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.
వివేకా హత్య కేసు బదిలీ అంశం.. తీర్పు వచ్చే వారానికి వాయిదా
SC ON YS VIVEKA MURDER CASE UPDATES : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషన్‌పై వచ్చే సోమవారం తీర్పు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 21న (ఈరోజు) తీర్పు ఇవ్వనున్నట్లు గతంలో ప్రకటించిన సర్వోన్నత న్యాయస్థానం.. మరో వారంపాటు దాన్ని వాయిదా వేసింది.
SC ON YS VIVEKA MURDER CASE
నేడు తీర్పు ఇవ్వనున్నట్లు గత సోమవారం ధర్మాసనం ప్రకటించింది. అయితే మరో వారం రోజులు వాయిదా వేస్తూ.. ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు.. హత్య కేసు దర్యాప్తు బదిలీ చేయాలన్న అంశంతో ముడిపడి ఉన్నందున వచ్చే సోమవారం తీర్పు వెలువరిస్తామని జస్టిస్ షా, జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం వెల్లడించింది.
ఇవీ చదవండి: