కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నాగలక్ష్మి అనే విద్యార్థిని పట్టణంలోని గురు రాఘవేంద్ర పాఠశాలలో మూడవ తరగతి చదువుతోంది. పాఠశాలలో ఏదైనా విభిన్నంగా ప్రాజెక్ట్ వర్క్ చేసుకురమ్మని ఉపాధ్యాయులు చెప్పగా...ఈ బాలిక కందిపప్పుతో హిందిలో వర్ణమాల రూపొందించింది. 150 గ్రాముల కంది పప్పుతో నాగలక్ష్మి వాటిని...మూడు గంటల పాటు శ్రమించి వర్ణమాల తయారుచేసింది. ఈ విధంగా రూపొందించడంపై ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందిస్తున్నారు.
కందిపప్పుతో వర్ణమాల
ఈ మధ్య విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు ఉపాధ్యాయులు వివిధ రకాల ప్రాజెక్టు వర్క్లు ఇస్తున్నారు. విద్యార్థులు వాటిని చాకచక్యంగా చేస్తూ.. భళా అనిపిస్తున్నారు.
కందిపప్పుతో వర్ణమాల తయారు చేసిన నాగలక్ష్మి