ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదర్శ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య - కడపలో పదవ తరగతిని విద్యార్థిని ఆత్మహత్య వార్తలు

కడప జిల్లా పుల్లంపేట ఆదర్శ పాఠశాలలో విషాదం జరిగింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని లక్ష్మీప్రసన్న ఆత్మహత్య చేసుకుంది. వసతి గృహంలో ఫ్యాన్​కు ఉరి వేసుకుంది. విద్యార్థిని మృతికి ఉపాధ్యాయుడు శివ వేధింపులు కారణమనే ఆరోపణలు వినిస్తున్నాయి.

student sucide in model school kadapa district

By

Published : Nov 19, 2019, 11:49 PM IST

ఆదర్శ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

కడప జిల్లా పుల్లంపేట ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని... లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకుంది. పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థిని... వసతి గృహంలోని ఫ్యాన్​కు ఉరి వేసుకుంది. విషయం తెలుసుకున్న రాజంపేట పట్టణ సీఐ శుభకుమార్, డీఈవో శైలజ, విద్యాశాఖ అధికారులు వసతి గృహానికి చేరుకొని పరిశీలించారు. తోటి విద్యార్థులతో మాట్లాడారు.

వసతి గృహ అధికారిని విచారించారు. పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాఠశాలలోని శివ అనే ఉపాధ్యాయుడు 3 నెలలుగా వేధిస్తున్నాడని... ఇదే విషయాన్ని పలుమార్లు పాప తమకు చెప్పిందని లక్ష్మీ ప్రసన్న చిన్నమ్మ ఆరోపించారు.

ఆత్మహత్యపై పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరక్కుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థిని వేధించిన ఉపాధ్యాయుడు శివ, పాఠశాల ప్రిన్సిపల్​పై చర్యలు తీసుకోవాలి టీఎన్​ఎస్​ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : మార్కాపురంలో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details