కడపజిల్లా జమ్మలమడుగులో విషాదం జరిగింది. బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు.. చక్రాల కిందపడి విద్యార్థిని మృతి చెందింది. బాలిక అంబవరం గ్రామానికి చెందిన రాజేశ్వరిగా గుర్తించారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న రాజేశ్వరి... పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా... చెయ్యి జారటంతో వెనుక చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.
ప్రమాదవశాత్తు బస్సు కిందపడి విద్యార్థిని మృతి - కడప జిల్లాలో బస్సు ప్రమాదం వార్తలు
బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు చెయ్యి జారి.. బస్సు చక్రాల కిందపడి విద్యార్థి మృతి చెందిన ఘటన జమ్మలమడుగులో జరిగింది.
ప్రమాదవశాత్తు బస్సు కిందపడి విద్యార్థిని మృతి