ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజంపేటలో విషాదం- ఒకే రోజు తల్లి, తనయుడు మృతి - son_and_mother_died_in_same_day_in_kadapa_rajampeta

నవమాసాలు మోసి కనిపించిన బిడ్డ ఇక లేడని తెలుసుకున్న ఆ తల్లి మనసు తల్లడిల్లింది. బిడ్డ హత్యకు గురైన విషయం తెలుసుకున్న మరుక్షణం కుప్పకూలిపోయింది. కొడుకు మృతదేహం ఇంటికి చేరకముందే ఆమె మృత్యు ఒడిలోకి జారుకుంది.

రాజంపేటలో ఒకే రోజు తల్లి, కుమారుడు మృతి

By

Published : May 5, 2019, 6:35 AM IST

కడప జిల్లా రాజంపేట కనకమ్మ వీధిలో విషాదం నెలకొంది. ఒకే రోజు తల్లి, కుమారుడు మృతి చెందారు. బాలాజీని గత నెల 29న కొందరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి భాగ్యమ్మకు(70) కుమారుడి మరణవార్త విని తట్టుకోలేకపోయింది. తీవ్ర మనోవేదనకు గురై కన్నుమూసింది.
మృతుడు బాలాజీకి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఏ ఆధారం లేని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు, స్థానికులు కోరుతున్నారు.

రాజంపేటలో ఒకే రోజు తల్లి, కుమారుడు మృతి

ABOUT THE AUTHOR

...view details