ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహిళల ఆర్థిక స్వావలంబనతోనే సమాజాభివృద్ధి'

మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులేస్తేనే..వారి కుటుంబంతో పాటు సమాజం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని కడప కలెక్టర్ స్పష్టం చేశారు. సహకార సంఘాలను ఏర్పాటు చేసి, పాడి పరిశ్రమను బలోపేతం చేసే దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబనతోనే సమాజాభివృద్ధి
మహిళల ఆర్థిక స్వావలంబనతోనే సమాజాభివృద్ధి

By

Published : Oct 20, 2020, 10:33 PM IST

సహకార సంఘాలను ఏర్పాటు చేసి, పాడి పరిశ్రమను బలోపేతం చేసే దిశగా రైతులను ప్రోత్సహించాలని కడప జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ స్పష్టం చేశారు. సహకార సంఘాల ఏర్పాటు, పాడిరైతుల ఆర్ధిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మాస్టర్ ట్రైనర్ల ఎంపిక కోసం..పశుసంవర్ధక, వ్యవసాయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులేస్తేనే..వారి కుటుంబంతో పాటు సమాజం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ వ్యాఖ్యానించారు.

ఆడ పిల్లల పుట్టుకపై మార్పు రావాలి
సబ్ కలెక్టర్ పృద్వీ తేజ్ అధ్యక్షతన "బేటీ బచావో బేటీ పడావో" అంశంపై ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజ ఆధ్వర్యంలో కడప డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమాజంలో ఆడపిల్లల పుట్టుకపై మార్పు రావాలని సబ్​ కలెక్టర్ వ్యాఖ్యానించారు. ఆడపిల్లల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. వారిని చదివించి ఆర్థికాభివృద్ధిలోకి తీసుకురావాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details