కడప జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలో ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్.. తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓబులవారిపల్లె మండలం తల్లెంవారిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ప్లాస్టిక్ క్యాన్లో తరలిస్తున్న పది లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు.
ఎస్ఈబీ దాడుల్లో నాటుసారా స్వాధీనం... ముగ్గురు అరెస్టు
కడప జిల్లా కోడూరు మండల పరిధిలో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. వేర్వేరు చోట్ల పదిహేడు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేసినట్లు సెబ్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ తెలిపారు.
పోలీసుల అదుపులో నిందితులు
మరోచోట ముత్తరాసుపల్లి సమీపంలో ఏడు లీటర్ల నాటుసారా సీజ్ చేసి.. ఒక వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి.. నందలూరు కోర్టులో హాజరుపరిచామన్నారు. వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు