కడప జిల్లా మైలవరం మండలం దొడియం గ్రామంలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో కొలువైన శివ కేశవుల విగ్రహాలను భజనల నడుమ ఘనంగా ఊరేగించారు. సమీపంలోని రామచంద్రాయపల్లి గ్రామంలో సైతం ఉత్సవ మూర్తులను విహరింపజేశారు. రాత్రికి స్వామి వారిని తిరిగి దొడియం గ్రామానికి చేర్చి.. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఘనంగా సంక్రాంతి ఉత్సవాలు.. శివ కేశవుల విగ్రహాల ఊరేగింపు
సంక్రాంతి పండుగంటేనే రంగురంగుల ముగ్గులు, రకరకాల పిండి వంటలు, ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్లతో ఆనందంగా చేసుకుంటారు. అటువంటి పండుగను కడప జిల్లా దొడియం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో కొలువైన శివ కేశవుల విగ్రహాలను భజనలు చేస్తూ ఊరేగించారు. ప్రత్యేక పూజలు చేశారు.
ఘనంగా సంక్రాంతి ఉత్సవాలు.. శివ కేశవుల విగ్రహాల ఊరేగింపు..