కడప జిల్లా రైల్వేకోడూరులోని పారిశుద్ధ్య కార్మికులతో ఈటీవీ భారత్ ముచ్చటించింది. నేడు అందిరితో ప్రశంసలందుకుంటూ.. ప్రాణాలు హరించే కరోనాకు భయపడకుండా విధులు నిర్వహిస్తున్న వారి మనోగతం వారి మాటల్లోనే..
'విధులు నిర్వహించడాన్ని బాధ్యతగా భావిస్తున్నాం'
కరోనా నేపథ్యంలో అత్యవసర సేవలు అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను నేడు దేశం నిజమైన యోధులుగా కీర్తిస్తోంది. లాక్ డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనా.. వారు మాత్రం విధులు నిర్వహిస్తూ హీరోలుగా నిలుస్తున్నారు. మరి ఇప్పుడు వారి మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా!
'ఉదయం 5 గంటల నుంచి మా పని ప్రారంభమవుతుంది. ముందుగా వీధుల్లో ఉండే చెత్త తొలగించి, డ్రైనేజీ శుభ్రం చేస్తాం. అనంతరం వీధుల్లో క్రిమిసంహారక ద్రావణం పిచికారీ చేస్తాం. బ్లీచింగ్ పౌడర్ చల్లుతాం. ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటున్నా.. అత్యవసర సిబ్బందిగా మేము పనిచేయడం గర్వంగా ఉంది. పనిచేస్తున్నా మేము తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాం. మాస్కులు, గ్లౌజులు వంటివి ధరిస్తున్నాం. ఈ మహమ్మారి త్వరగా పోవాలని కోరుకుంటున్నామని' వారు తెలిపారు.
ఇవీ చదవండి.. కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు!
TAGGED:
sanitation workers opinions