కడప జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ కే.చక్రవర్తి ఆధ్వర్యంలో నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణాపై ముమ్మరంగా దాడులు నిర్వహించారు. జిల్లాలో 12 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని, 750 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 1.6 లీటర్ల దేశీ అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఐదు కేసులు నమోదు చేసి, ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఘటనలో.. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లు, 26.5 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. మూడు కేసులు నమోదు చేశారు. ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.