కడప జిల్లా చక్రాయపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. చక్రాయపేటలో ఆర్ఎంపీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఇర్ఫాన్ బాషా అనే వ్యక్తి.. వైద్యం నిమిత్తం కుమారకాల్వ గ్రామానికి వెళ్లాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాపాగ్ని నది ప్రవాహం ఎక్కువ కావడంతో.. ఇర్ఫాన్ బాషా కుమారకాల్వలోనే ఉండిపోయాడు.
నీటి ప్రవాహం కొంచెం తగ్గుముఖం పట్టడంతో.. గ్రామస్తుల సాయంతో నది దాటేందుకు ప్రయత్నం చేశాడు. అయితే.. ప్రమాదవశాత్తూ నలుగురూ నీటిలో కొట్టుకుపోయారు. అయితే.. వారిలో ముగ్గురు చెట్టును పట్టుకుని సురక్షితంగా బయటపడగా.. ఇర్ఫాన్ మాత్రం వరద నీటిలో(RMP DOCTOR MISSING IN PAPAGNI RIVER FLOOD) గల్లంతయ్యాడు.