ఆత్మరక్షణ కోసం.. అటవీశాఖ అధికారులకు రివాల్వర్
కడప జిల్లాలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న తమిళ కూలీలను బద్వేలు అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.
తుపాకి
అటవీశాఖ అధికారులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆత్మరక్షణ కోసం అటవీశాఖ అధికారులకు తుపాకులు అందజేసింది. గతంలో కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీశాఖ అధికారులపై దాడి చేసి కొందరిని హతమార్చడం జరిగింది. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం తుపాకులను అందజేసింది. సిద్ధవటం, ఒంటిమిట్ట, కడప, రాయచోటి, వేంపల్లి అటవీ శాఖ రేంజర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది.